ETV Bharat / state

వాటా పెంచాల్సిందే - 15th finance commission

రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచాలి... సంక్షేమ పథకాల రూపకల్పనలో స్వేచ్ఛ ఇవ్వాలి... రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నాకే... కేంద్ర పథకాలు ప్రవేశపెట్టాలి.. 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తులివి.

రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని ఆర్థిక సంఘానికి కేసీఆర్ వినతి
author img

By

Published : Feb 19, 2019, 8:19 PM IST

రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని ఆర్థిక సంఘానికి కేసీఆర్ వినతి
వనరుల వినియోగం రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేలా విధానాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర పర్యటనలో ఉన్న 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. జూబ్లీహాల్​లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు.

'స్థానిక' నిధులు పెంచండి

కొత్త పథకాలను రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వాటా పెంచాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన గ్రాంట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన పంచాయతీలు, పురపాలక సంఘాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేయాలని నివేదించారు.

పథకాల రూపకల్పనలో స్వేచ్ఛ

14వ ఆర్థిక సంఘం అంచనా ప్రకారం రాష్ట్రాల్లో కేంద్రం వ్యయం 20 శాతం ఉండగా... పెరుగుతున్న వ్యయం దృష్ట్యా ఈసారి వాటా మరింత పెంచాలని కోరారు. స్థానిక అవసరాలనుగుణంగా విధానాలు రూపొందించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న రాష్ట్రాలకు జీఎస్​డీపీలో 3శాతం రుణం తీసుకునే వెసులుబాటు, అదేవిధంగా ఒకశాతం అదనంగా పొందేలా అవకాశమివ్వాలని కోరారు. కేంద్ర పన్నుల వాటాను కూడా 42 నుంచి 50శాతానికి పెంచాలని విన్నవించారు.

ఎత్తిపోతలకు రూ.40వేల కోట్లివ్వండి

కోటీ 24లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 80వేల కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమయ్యే 40వేల 169కోట్లు కేంద్రం ఇచ్చేలా ప్రతిపాదించాలని కోరారు. అంతేకాకుండా ఇంటింటికీ రక్షిత మంచి నీరు అందించే మిషన్ భగీరథకు 12 వేల 722 కోట్లు గ్రాంటుగా ఇచ్చేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Intro:hyd_tg_35_19_medical_college_enquary_pkg_bytes_C10
యాంకర్:

Body:మెడికల్ కళాశాల నిర్వహణ లోపంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచనంగా మారింది బోధనా సిబ్బందికి వేతనాలు అందక వారు విధులకు హాజరు కాకపోవడంతో వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేక లబోదిబో అని మొత్తుకుంటున్న పట్టించుకునేవారు లేరని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వాయిస్ ఓవర్ 1:సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో మహేశ్వర వైద్య కళాశాల కొంతకాలం ఏర్పాటు చేశారు అయితే నిన్న మొన్నటి వరకు బాగానే సాగినా ప్రస్తుతం దాని నిర్వహణ మాత్రం కుంటుపడింది వైద్య విద్యార్థులకు పాఠ్యాంశాల చెప్పే బోధకులు తరగతులు కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంద
బైట్1: శుభం వైద్య విద్యార్థి
బైట్2: చరణ్ వైద్య విద్యార్థి
వాయిస్ ఓవర్ 2: గత ఆరు నెలలుగా బోధనా సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తరగతులకు హాజరు అవడం లేదు తరగతుల హాజరు కావడంతో విద్యార్థులు తమ పాఠ్యాంశాలు దెబ్బతినే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాల యాజమాన్యం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు యాజమాన్య స్పందించకపోవడంతో విద్యార్థులు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కళాశాల వద్ద ఆందోళనకు దిగారు అంతేకాకుండా జిల్లా పాలనాధికారి ఫిర్యాదు చేశారు
బైట్3: దివ్యశ్రీ మెడికల్ విద్యార్థిని
బైట్4: హరిచరణ్ అధ్యాపకులు
బైట్5: సామ మనోహర్ అధ్యాపకులు
వాయిస్ ఓవర్ 3: వైద్య కళాశాల విద్యార్థులు ఫిర్యాదుతో జిల్లా పాలనాధికారి హనుమంతరావు స్పందించారు స్థానిక తాసిల్దార్ సహాయంతో ఆర్డీవో తో విచారణ నిర్వహించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని పురమాయించారు దీనిలో భాగంగానే ఆర్ డి వో విద్యార్థులు అడిగి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని విచారించారు విద్యార్థులు చెప్పినవి వాస్తవంగానే ఉన్నాయని కళాశాల యాజమాన్యం నిర్వహణ సక్రమంగా లేదని ఆయన తెలిపారు దీనిపై కళాశాల యాజమాన్యం వివరణ కోరగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు
బైట్ 6: శ్రీను ఆర్డీవో సంగారెడ్డి
బైట్7: శివరాం రెడ్డి మహేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్

Conclusion:ముగింపు వాయిస్ ఓవర్: లక్షలు పోసి తమ పిల్లలను వైద్య కళాశాలలో చేర్చామని ప్రస్తుతం తరగతులు నిర్వహించకపోవడంతో పరీక్షల్లో ఎలా నెగ్గుకు వస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.