ETV Bharat / state

వైకల్యాన్ని పక్కకు నెట్టి.. కుటుంబానికి అండగా నిలిచి..

కోటి కలలతో పుట్టింటికొచ్చిందామె... పురుడు పోసుకోవడానికని! కానీ.. ఎన్నో సంతోషాలని మిగల్చాల్సిన ఆ సమయం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది. అప్పుడు జరిగిన ఓ ఘోరప్రమాదం ఆమెని 22 ఏళ్లుగా మంచానికే పరిమితం చేసింది. ఆ చేదుగతాన్ని చెరిపేసి సంతోషపు వర్తమానాన్ని రాసుకోవడానికి ఛాయాదేవి చేసిన ప్రయత్నాలు తక్కువేం కాదు. వైకల్యాన్ని పక్కకు నెట్టి తన కుటుంబానికి అండగా నిలిచిన ఆమె కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం...

vasundhara, Chayadevi
వైకల్యాన్ని పక్కకు నెట్టి.. కుటుంబానికి అండగా నిలిచి..
author img

By

Published : Mar 28, 2021, 1:09 PM IST

హైదరాబాద్‌లోని బోరబండ దగ్గరున్న కబీర్‌నగర్‌లో నివాసం ఉంటారు వాస ఛాయాదేవి. వాళ్లింట్లో అడుగుపెట్టాలంటే అందమైన కుండీల్లోని పచ్చని మొక్కలని దాటుకుని వెళ్లాల్సిందే. ‘అబ్బ!... ఎవరో ఇంత ఓపిగ్గా పెంచారు’ అని మన మదిలో ఓ ప్రశ్న ఉదయించకమానదు. ఆ ప్రశ్నకు సమాధానం 22 ఏళ్లుగా మంచానికే అతుక్కుపోయిన ఛాయాదేవి అని తెలిసినప్పుడు మనసు చెరువవుతుంది. ఇదెలా సాధ్యం అనిపిస్తుంది. దానికి ఆమే గలాగలా మాట్లాడుతూ సమాధానమిస్తారు.

అనుకోని ప్రమాదం...

‘1999 ఏప్రిల్‌ 5వ తేదీ.. మియాపూర్‌ జాతీయ రహదారి నుంచి ఇంద్రారెడ్డికాలనీకి వెళ్లే బైపాస్‌ రోడ్డు రహదారి మూలమలుపునకు దిగువన అమ్మవాళ్ల ఇల్లు. అప్పుడు నేను ఏడునెలలు గర్భవతిని. ప్రసవం కోసం వెళ్లా. అమ్మ, నాన్న, చెల్లి వీళ్లతో సంతోషంగా గడిచిపోతున్న రోజులవి. ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో మంచంపై పడుకున్నా. ఆ సమయంలో ఎలా వచ్చిందో తెలియదు కానీ.. 14 చక్రాల లారీ, 2000 సిమెంటు బస్తాలతో గోడలను బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకువచ్చింది. నేను మంచంతో సహా లారీ కింద ఇరుక్కుపోయా. అమ్మకు కాలు విరిగింది. చెల్లికి కంటిపై భాగంలో లోతుగా గాయాలయ్యాయి. నాన్న ఇంట్లో లేరు. దాంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. నేనిక బతకననే అనుకున్నారంతా. అతి కష్టంమ్మీద నన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుబడి పోయాయి. ఏడో నెలలోనే సర్జరీ చేసి డెలివరీ చేశారు. బాబు పుట్టాడు. అప్పట్నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. అత్తింటివారు స్వాగతించలేకపోయారు నన్ను. అప్పుడు తాతయ్య ఇచ్చిన చిన్న స్థలమే నన్ను ఆదుకుంది’ అనే ఛాయాదేవి.. 22 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా తల్లి, చెల్లి, తండ్రి, కొడుకు బాధ్యతలని తీసుకున్నారు. చేతితో నడిపే కుట్టుమిషన్‌ తీసుకుని దాంతోనే చుట్టుపక్కల వారికి కుట్టుపని నేర్పిస్తూ వచ్చిన ఆదాయంతో ఆమె కుటుంబానికి ఆసరాగా నిలిచారు. బీమా కంపెనీలకు ఏజెంటుగా పనిచేసి కుటుంబాన్ని మెల్లగా గట్టెక్కించారు. దూరమైన భర్త తిరిగొస్తే ట్రావెల్స్‌ వ్యాపారం కోసం కారుని కొనిపెట్టారు. కానీ ఆ సంతోషమూ ఆమెకు ఎన్నాళ్లో నిలవలేదు. ఇటీవల భర్త మరణిస్తే...కొడుకుని చదివించే బాధ్యతని తలకెత్తుకున్నారు.

నేనిక బతకననే అనుకున్నారు!
పచ్చని మొక్కలు

కష్టాలు, కన్నీళ్లు ముప్పేట దాడిచేస్తున్నా ముఖంలో చిరునవ్వుని చెరగనివ్వరు ఛాయాదేవి. అందుకు కారణం తన చుట్టూఉన్న పచ్చని మొక్కలేనంటారు. ‘నాన్న సాయంతో మంచంపై కూర్చునే కుండీలకు పెయింట్‌ వేయడం, ఎరువులు తయారుచేయడం, అంట్లు కట్టడం, కత్తిరింపులు వంటివి చేస్తాను. మా టెెర్రస్‌పైన సుమారు 300 రకాల మొక్కలను పెంచాను.’ అనే ఛాయాదేవి ఎందరికో స్ఫూర్తిదాయకం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.