ETV Bharat / state

Vanajeevi Ramaiah: ఎంపీ సంతోష్​ కుమార్​ను కలిసిన వనజీవి రామయ్య దంపతులు - వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: దేశమంతా పచ్చబడాలని హరితసంకల్పంతో మొదలుపెట్టిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని వనజీవి రామయ్య దంపతులు ఆకాంక్షించారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్​ను వారు కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు.

Vanajeevi Ramaiah: ఎంపీ సంతోష్​ కుమార్​ను కలిసిన వనజీవి రామయ్య దంపతులు

author img

By

Published : Jan 19, 2022, 7:44 PM IST

Vanajeevi Ramaiah: అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య ఆయన సతీమణితో కలిసి రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్​ను కలిశారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సంతోష్ కుమార్​తో సమావేశమయ్యారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరితసంకల్పంతో మొదలుపెట్టిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందనం చేసి సంతోష్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు.

ప్రస్తుతం మన ముందున్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని... ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అందుకు పరిష్కారమని రామయ్య అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని ఆయన తెలిపారు. ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య దంపతులను కలవడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు సిద్ధమని ఎంపీ తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.