ETV Bharat / state

ప్రేమించాలంటే ఈ లక్షణాలు ఉండాలి.. మరి మీలో ఉన్నాయా..?

author img

By

Published : Feb 9, 2023, 12:59 PM IST

Valentine's Day Special : 'ప్రేమంటే సులువు కాదురా.. అది నీవు గెలవలేవురా' అన్నాడో సినీ కవి. నిజమే.. ప్రేమించడం, ప్రేమను పొందుకోవడం అంత సులభం కాదు. ప్రపంచంలో ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు. మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ప్రేమంటే అనుకున్నంత సులభం కాదు. మరి ప్రేమించాలన్నా.. ఆ ప్రేమను పొందుకోవాలన్నా కొన్ని లక్షణాలుండాలి. ఇవి మీలో ఉన్నాయా..?

Valentine's Day Special
Valentine's Day Special

Valentine's Day Special : ప్రేమ.. చదవడానికి రెండక్షరాలే. కానీ దీని చుట్టే మనుషులు, సమాజం తిరుగుతుంది. గర్భంలో పిండ దశలో ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. తర్వాత పెరుగుతున్న కొద్దీ దశల వారీగా కుటుంబ సభ్యుల ప్రేమను పొందుకుంటాం. తర్వాత పాఠశాల, కళాశాలల్లో స్నేహితులు ప్రేమను చూపిస్తారు. కొంత మందికి ఇదే సమయంలో ప్రియులు, ప్రియురాళ్లు దొరుకుతారు. మరికొందరికి ఉద్యోగ సమయంలో దొరుకుతారు. ఏది ఏమైనప్పటికీ మనిషి ప్రతి దశలో ఎవరో ఒకరి ప్రేమను పొందుకోవడం కామన్.

Valentine's Day Special Love Story : ప్రేమ గురించి నాటి ప్రేమ దేశం నుంచి నేటి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వరకు వందల్లో సినిమాలు, లక్షల్లో పాటలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. అయినా అది కొత్తగానే ఉంటుంది. ఏ బంధం అయినా నిలబడాలన్నా.. కొనసాగాలన్నా దానికి ప్రేమ అవసరం. చాలా మంది వారి మధ్య సంబంధం సఖ్యంగా ఉన్నంత వరకు ప్రేమిస్తారు. మరికొందరు డబ్బు ఉన్నంత వరకు ప్రేమిస్తారు. కానీ కష్ట నష్టాల్లో ఉన్నప్పడు, వ్యాధి బాధల సమయంలో మనకు తోడుగా ఉండే వారే మనల్ని నిజంగా ప్రేమించేవారు. ఈ అంశాల్లో భరోసా ఇవ్వగలిగితే ప్రేమించడం, ప్రేమను పొందుకోవడం కష్టమేమీ కాదు.

1. Trust: ప్రేమలో అత్యంత ప్రాముఖ్యమైంది నమ్మకం. ఇది పునాది లాంటిది. ఎదుటివారిలో నమ్మకం కలిగించడం. వారి నమ్మకాన్ని చూరగొనటం అంత సులువేమీ కాదు. మీరు ప్రేమించేవారిలో ఒక్కసారి నమ్మకం కలిగిస్తే వారిని సగం దక్కించుకున్నట్లే. అంతేకాకుండా దీన్ని నిలబెట్టుకోవడమూ కష్టమే. నమ్మకం కలిగించడానికి చాలా సమయం పడుతుంది కానీ కోల్పోడానికి ఒక్క క్షణం చాలు.

2. Secure Feeling: ప్రేమ పొందుకోవడానికి రక్షణ, భద్రత భావన అనేది కూడా ముఖ్యమే. ప్రత్యేకంగా అమ్మాయిల విషయంలో ఇది చాలా అవసరం. వారు మీతో ఉంటే, మీ దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటామన్న భావన వారిలో కలిగిస్తే చాలు.. ఆమె మీ సొంతం అయినట్లే. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద ఆపదల వరకు ప్రతి విషయంలో దీన్ని ఆశిస్తారు. కానీ దీని పేరుతో వారిపై ఆంక్షలు పెట్టకూడదన్న విషయం మర్చిపోకండి.

3. Fit In Financial : నేటి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడో రచయిత. నిజమే ప్రేమిస్తే సరిపోదు. వారిని చక్కగా చూసుకోవడానికి పైసలు కూడా ఉండాలి. అలా రూ.లక్షలు, కోట్లు ఉండకున్నా.. కనీస అవసరాలు తీర్చేంత సంపాదించాలి. అత్యవసర సమయంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా చూసుకోవాలి. కేవలం ప్రేమతోనే ఆకలి తీరదు కదా. కడుపు నిండాలంటే మనీ ఉండాల్సిందే.

4. Respect: అమ్మాయిలైనా అబ్బాయిలైనా కోరకునే అంశాల్లో గౌరవం ఒకటి. అమ్మాయలైతే దీన్ని కచ్చితంగా ఆశిస్తారు. వారి విషయంలోనే కాకుండా కుటుంబ సభ్యుల విషయంలోనూ ఇదే కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ముఖ్యంగా పబ్లిక్ ప్రాంతాల్లో మీరు గౌరవం ఇవ్వాలనుకుంటారు. ఇవ్వడం మీ కర్తవ్యం కూడా.

5. Dont Have Bad Habits: అమ్మాయిలు కోరుకునే లక్షణాల్లో ఇది ముందు వరసలో ఉంటుంది. చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని దూరం చేయడమే కాకుండా సంబంధాలనూ దెబ్బతీస్తాయి. నేటి కాలంలో ఇవి లేని వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఉన్న వారు సైతం .. రిలేషన్ లోకి వచ్చాక మెల్ల మెల్లగా తగ్గించడం. లేదా పూర్తిగా మానేయడం చెయ్యాలి. కొంత మంది వాళ్ల ప్రియులకు.. తరువాత మానేస్తా అని మాటిస్తారు. కానీ తరువాతి కాలంలో అలా చేయరు. కోరుకున్న వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే వారికి మీ మీద ఉన్న ప్రేమ మరితం రెట్టింపు అవుతుంది.

ఇంకెందుకు ఆలస్యం.. ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకుని అందుకు అనుగుణంగా ముందడుగు వేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.