ETV Bharat / state

లైవ్​ వీడియో: రేవతికి చిర్రెత్తుకొచ్చింది... చితకబాదింది

ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్​గేట్ వద్ద ఆ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి హంగామా చేశారు. టోల్​ కట్టకుండా వెళ్తున్న ఆమెను సిబ్బంది ఆపారు. తన కారు ఆపుతారా అంటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై చేయిచేసుకున్నారు.

ap news
‘నన్నే టోల్‌ ఫీజు చెల్లించమంటారా.. నేను ఎవరనుకుంటున్నావ్​?’
author img

By

Published : Dec 10, 2020, 10:56 AM IST

Updated : Dec 10, 2020, 1:50 PM IST

గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ 16వ నంబరు జాతీయ రహదారి. బుధవారం ఉదయం 10.30 గంటల సమయం. వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. ఫాస్టాగ్ లైన్లలో కాకుండా వీఐపీ లైన్ వద్దకు వచ్చి వాహనం ఆగింది. టోల్ గేట్ సిబ్బంది వచ్చి కార్పొరేషన్ ఛైర్మన్లకు ఉచితంగా వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో కారు డ్రైవర్ వాహనం దిగి... అక్కడ అడ్డుగా ఉన్న బారికేడ్​ని కాలితో తన్నారు. సిబ్బంది వారించగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు వాగ్వాదం తర్వాత డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. టోల్ గేట్ ఉద్యోగి ప్రవీణ్ ఈసారి ఇనుప బారికేడ్లు అడ్డుగా ఉంచారు.

సీసీ కెమెరాల్లో రికార్డైన తంతు

ఈసారి దేవళ్ల రేవతి స్వయంగా కారు దిగి వారిపై ఆగ్రహం వెలిబుచ్చారు. బారికేడ్లు తీసేందుకు యత్నించారు. సిబ్బంది వద్దని వారిస్తున్నా బారికేడ్​ను పక్కకు లాగేశారు. డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు యత్నించారు. సిబ్బంది మరోసారి బారికేడ్లను అడ్డుగా ఉంచారు. ఛైర్ పర్సన్ రేవతి రెండోసారి కూడా బారికేడ్లను లాగేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవటంతో సిబ్బందిపై కోపంతో ఊగిపోయారు. జాతీయ రహదారుల సంస్థ ఉద్యోగి ప్రవీణ్​పై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిబ్బంది అవాక్కయ్యారు. మరో అధికారి వచ్చి వాహనం పంపించి వేయమని చెప్పి బారికేడ్లు పక్కకు తీశారు. దీంతో వాహనం ముందుకు వెళ్లిపోయింది. ఈ వ్యవహారం మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీల్లో రికార్డయింది. టోల్ గేట్ సిబ్బంది కూడా తమ ఫోన్లలో ఈ తంతు రికార్డు చేశారు.

రేవతికి చిర్రెత్తుకొచ్చింది... చితకబాదింది

ఘటనపై కేసు నమోదు

టోల్ గేట్ సిబ్బందిపై చేయి చేసుకున్న వ్యవహారం మీడియాలో రావటంతో సంచలనమైంది. సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వచ్చాయి. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన టోల్ ప్లాజా అధికారులు.. వారి సూచన మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన వాగ్వాదం, చేయిచేసుకోవటాన్ని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీసీ 188, 294బి, 323, 341, 506ఆర్​డబ్ల్యూ34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో సైరన్ మోగించటం, రహదారిపై వేరే వాహనాలు వెళ్లకుండా ఇబ్బంది కలిగించటం, సిబ్బందిపై చేయి చేసుకోవటం వంటి కారణాలతో కేసు నమోదుచేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

లైవ్​ వీడియో: రేవతికి చిర్రెత్తుకొచ్చింది... చితకబాదింది

దేవళ్ల రేవతి గతంలో గుంటూరు జిల్లా బెల్లంకొండ జడ్పీటీసీగా పనిచేశారు. వైకాపా తరఫున జడ్పీ ఫ్లోర్ లీడర్​గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ పదవుల నియామకంలో ఛైర్ పర్సన్​గా అవకాశం వచ్చింది. ఇపుడు టోల్ గేట్ ఉద్యోగిపై చేయి చేసుకోవటం ద్వారా ఆమె పేరు వార్తల్లోకెక్కింది.

Last Updated : Dec 10, 2020, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.