కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి వి.హనుమంతరావు లేఖ రాశారు. తెలంగాణ పీసీసీ, సీఎల్పీ నియామకం సమయంలో పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పార్టీకి విధేయులుగా ఉండడంలేరని వీహెచ్ పేర్కొన్నారు.
ఇటీవల కాంగ్రెస్ తరఫున గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ విధేయులు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరాలను వీహెచ్ ఆ లేఖలో ఉదహరిస్తూ వివరించారు.
ఇదీ చదవండి: అమెరికాలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!