ETV Bharat / state

"ఉయ్యాలవాడ కుటుంబాన్ని చిరంజీవి, రాంచరణ్​ మోసగిస్తున్నారు" - చిరంజీవి సైరా కేసు విషయం

ఉయ్యాలవాడ కుటుంబాన్ని నటుడు చిరంజీవి, నిర్మాత రాంచరణ్ మోసగిస్తున్నారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సౌత్ ఇండియా సేవాసమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి ఆరోపించారు.

UYYALAVADA FAMILIES ALLEGATIONS ABOUT CHIRANJEEVI SYRAA MOVIE
author img

By

Published : Sep 26, 2019, 11:06 PM IST

'చిరంజీవి, రాంచరణ్​ ముందే మాతో ఒప్పందం​ చేసుకున్నారు'

మెగాస్టార్​ నటిస్తున్న సైరా సినిమా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర కాదని దర్శకుడు సురేందర్​రెడ్డి హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి తెలిపారు. ఈ నెల 26న గురువారం హైకోర్టులో ఉయ్యాలవాడ వారసులు వేసిన పిటిషన్​పై జరిగిన విచారణపై స్పందించారు. సైరా చిత్రం... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్నామని చిరంజీవి, రాంచరణ్​ చెప్పినట్లు గుర్తుచేశారు. ఉయ్యాలవాడ వారసులతో ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ వారసులకు సైరా సినిమాను విడుదలకు ముందే చూపించాలని కోరారు. వారి కుంటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా నిర్మాత రాంచరణ్ హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. ఒప్పందం ప్రకారం ఏడు కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ఉయ్యాలవాడ వారసులు కోరారు.

ఇవీ చూడండి: ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు

TG_Hyd_70_26_Uyyalavada Familys On Court_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) సైరా నరసింహారెడ్డి సినిమా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర కాదని సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి హైకోర్టు తప్పుదోవ పట్టిస్తున్నారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సౌత్ ఇండియా సేవసమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26న గురువారం హైకోర్టు లో సైరా సినిమాకు సంబంధించి ఉయ్యాలవాడ వారసులు వేసిన పిటిషన్ పై విచారణ జరిగిందని ఆయన హైదర్ గూడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. గతంలో సినీ నటులు చిరంజీవి , రాంచరణ్ లు సైరా నరసింహా రెడ్డి సినిమా... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కధ ఆధారంగా నిర్మిస్తున్నామని ఆయన వారసులకు చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. చిరంజీవి , రాంచరణ్ లు ఉయ్యాలవాడ వారసులతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ వారసులకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదలకు ముందే చూపించాలని ఆయన కోరారు. ఈ సినిమాపై అన్ని ఆధారాలతో సాక్ష్యాలు ప్రవేశపెడతామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు. తమను ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా నిర్మాత , నటుడు రాంచరణ్ హామీ ఇచ్చి మోసం చేయడమే కాకుండా... తాము 50 కోట్లు డిమాండ్ చేశామని ప్రచారం చేస్తున్నారని ఉయ్యాలవాడ వారసురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాంచరణ్ ఒప్పందం ప్రకారం ఏడు కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు. బైట్ : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సౌత్ ఇండియా సేవసమితి అధ్యక్షుడు) బైట్: లక్ష్మీ, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసురాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.