ETV Bharat / state

గ్రేటర్​లో కాంగ్రెస్​ చేసిన అభివృద్ధే కనపడుతోంది: ఉత్తమ్​ - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం

గ్రేటర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 100 సీట్లు గెలుచుకొని మేయర్​ పీఠం కైవసం చేసుకుంటుందని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలో అభివృద్ధి పనులు చేసిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్​లోని వారాసిగూడ ప్రాంతంలో అభ్యర్థి ప్రభతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్​కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లని కోరారు.

uttham campaign in bouddha nagar division
గ్రేటర్​లో కాంగ్రెస్​ చేసిన అభివృద్ధే కనపడుతోంది: ఉత్తమ్​
author img

By

Published : Nov 23, 2020, 8:03 PM IST

Updated : Nov 23, 2020, 10:10 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో అభివృద్ధి పనులు చేసిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్​లోని వారాసిగూడ ప్రాంతంలో అభ్యర్థి ప్రభతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రగా వారాసిగూడ చౌరస్తా నుంచి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

తెరాస చేసిందేమి లేదు

గ్రేటర్​లో కాంగ్రెస్​ చేసిన అభివృద్ధే కనపడుతోంది: ఉత్తమ్​

అభ్యర్థి ప్రభకి ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఉత్తమ్​ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరదల నేపథ్యంలో, కరోనా విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా గెలవడం అసాధ్యమని, మతతత్వ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తూ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, భాజపా, ఎంఐఎంలు ఒక్కటేనని విమర్శించారు. హైదరాబాద్​లో మౌలిక వసతులు, సదుపాయాలతో పాటు రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, అనేక అభివృద్ధి పథకాలు, తాగునీటి సరఫరా అనేక విషయాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప తెరాస చేసిందేమీ లేదని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్​ఈసీ లేఖ.. ఎందుకంటే?

Last Updated : Nov 23, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.