ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే ఎంపీపీ, జడ్పీఛైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలని లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి .జూలై 5 తర్వాత ఎంపీపీ, జడ్పీఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల బేరసారాలకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఈ విషయంపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ నెల 21న రాజీవ్ గాంధీ వర్థంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'మోదీలై': ప్రధానిపై రాహుల్ కొత్త పంచ్‌లు