పైరవీ చేసే వాళ్లకు పీసీసీ పదవి ఇస్తే పార్టీ దెబ్బ తింటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి లాయల్‌గా ఉండే వారికే పదవి ఇవ్వాలన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వారే పీసీసీ చీఫ్ అవుతారనే ప్రచారం అవాస్తమని తెలిపారు. పీసీసీ రేసులో జానారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి వాళ్లూ ఉన్నారన్నారు.
రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: 'మోదీజీ.. ఖాతాలు కాదు ద్వేషాన్ని వదులుకోండి'