కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఆయన భార్య కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన వీహెచ్ దంపతులను టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలో నివాసముంటున్న వీహెచ్ ఇంటికి వెళ్లారు. ఆరోగ్య క్షేమాల గురించి ఆరా తీశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
ఇదీ చూడండి: చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం