కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల దాడి, లాఠీఛార్జీని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ అరెస్టు పిరికి పందల చర్య, సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలకు ప్రతిఘటన ఉంటుందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిపి.. అత్యంత పాశవికంగా హత్య చేశారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేయడమేంటంటూ ఆయన మండిపడ్డారు.
ఇంత దారుణం జరిగితే బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అడ్డుకుని.. వారిపై దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధల్లో ఉన్నవారిని పరామర్శించడం ధర్మమని ఆయన గుర్తు చేశారు. ఇదంతా దేశ ప్రజలు చూస్తున్నారని.. ఇందుకు ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.