ETV Bharat / state

భూ దందాలపై గవర్నర్​కు లేఖ రాస్తా: ఉత్తమ్​ - uttam kumar reddy news

రాష్ట్రంలో భూదందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్​కు లేఖ రాయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. భూముల ఆక్రమణలపై ఇందిరాభవన్​లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

uttam kumar reddy, uttam leeter to governor on land occupations
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, భూ దందాలపై ఉత్తమ్​ లేఖ
author img

By

Published : May 8, 2021, 7:26 AM IST

కాంగ్రెస్​ హయాంలో దళితులు, గిరిజనులకు లక్షల ఎకరాల భూ పంపిణీ చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో భూ దందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు లేఖ రాయనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. భూ ఆక్రమణలపై ఇందిరాభవన్​లో దూరదృశ్య మాధ్యమం ద్వారా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తెరాస నాయకులు దొంగల ముఠాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఉత్తమ్​ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్​ భూపోరాటం చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని.. మంత్రులు, నాయకులు అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఉత్తమ్​ మండిపడ్డారు.

ఇదీ చదవండి: నేటి నుంచి కరోనా టీకా మొదటి డోసు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.