తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం ఆగదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హోంమంత్రి ఇంటి వద్ద ధర్నా చేసి అరెస్టు అయిన 68 మంది కాంగ్రెస్ శ్రేణులతో ఇందిరా భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు సమావేశమయ్యారు. నాయకులెవరూ భయపడాల్సిన పని లేదని సూచించారు.
రాష్ట్రంలో ఏ అధికారి కూడా ప్రజల కోసం పనిచేయడం లేదని... పోలీసులయితే ఉద్యోగులని కూడా మార్చిపోయారని.. ఉత్తమ్ ఆరోపించారు. ఐపీఎస్ కాదు.. కేపీఎస్(కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యం)లా పోలీసులు తయారయ్యారని విమర్శించారు.
ప్రజాసమస్యలపై ప్రతిపక్షంగా తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని.. ఎక్కడ ఆగేది లేదని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటామని.. వారికి అండగా నిలబడుతామని వెల్లడించారు.
- ఇదీ చూడండి: 'మహిళా సాధికారత విషయంలో మనమే ముందున్నాం