ETV Bharat / state

US Defence Officials in hyderabad: 'రక్షణ రంగ బలోపేతానికి తెలంగాణ సహకారం'

author img

By

Published : Apr 29, 2022, 9:26 PM IST

US Defence Officials in hyderabad: రక్షణ రంగంలో అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలను యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లిండ్సే డబ్ల్యూ ఫోర్డ్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్​ను ఆమె సందర్శించారు. ఏరోస్పేస్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్, సాఫ్ట్‌వేర్ వంటి విభిన్న రంగాలకు చెందిన తెలంగాణ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌కు కూడా ఆమె హాజరయ్యారు.

US Defence Officials in hyderabad
టీ హబ్​ను సందర్శించిన యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లిండ్సే డబ్ల్యూ ఫోర్డ్

US Defence Officials in hyderabad: స్టార్టప్​లకు మద్దతు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మాన్ అన్నారు. రక్షణ రంగంలో టాటా అడ్వాన్స్​డ్ సిస్టమ్స్​తో లాక్ హీడ్, బోయింగ్, జీఈ లాంటి అమెరికా సంస్థలతో భాగస్వామ్యంతో తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రక్షణ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు.

ఏరోస్పేస్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం.. అమెరికాకు చెందిన హనీవెల్ ఏరోస్పేస్, ప్రాట్ అండ్ విట్నీ సంస్థలతో కలిసి మంచి వాతావరణాన్ని సృష్టించిందన్నారు. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వ కీలక పాత్ర భారత్- యూఎస్ రక్షణ భాగస్వామ్యానికి మరింత దోహదపడుతుందని జోయెల్ రీఫ్‌మాన్ తెలిపారు.

హైదరాబాద్​లోని టాటా-లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్పేస్ లిమిటెడ్​ను యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లిండ్సే డబ్ల్యూ ఫోర్డ్ సందర్శించారు. గతంలో తెలంగాణ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌కు కూడా ఆమె హాజరయ్యారు. యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫోర్డ్ దక్షిణ, ఆగ్నేయాసియా కోసం రక్షణ కోసం వ్యూహాలు, ప్రణాళికల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. రక్షణ రంగంలో కీలకమైన ప్రణాళికల అమలుకు సంబంధించిన అన్ని విషయాల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లోని సీనియర్ నాయకత్వానికి ప్రధాన సలహాదారుగా ఆమె వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ రావడానికి ముందే ఫోర్డ్ దిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి

ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు ఉన్నాయి : కేసీఆర్​

5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాపై ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.