ETV Bharat / state

Urea Shortage: వేధిస్తోన్న కొరత.. సరఫరాలోనే 4.85 లక్షల టన్నుల కోత - రాష్ట్రంలో యూరియా కొరత

రాష్ట్రంలో మెల్లమెల్లగా యూరియా కొరత పెరుగుతోంది. ఈ సీజన్‌ మొత్తానికి అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 10.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. దీనిని నెలవారీగా కొంత చొప్పున సరఫరా చేస్తారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి మొత్తం 9.10 లక్షల టన్నులు రావాలి. కేవలం 4.25 లక్షలే వచ్చింది. ఇంకా 4.85 లక్షలు రాలేదు.

Urea Shortage
యూరియా కొరత
author img

By

Published : Aug 5, 2021, 7:18 AM IST

వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండటంతో దానికి సమాంతరంగా ఎరువుల కొరత వేధిస్తోంది. ఈ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కోటీ 14 లక్షల ఎకరాలకు గాను ఇప్పటికే కోటి ఎకరాల్లో పంటలు వేశారు. మరోపక్క ఏప్రిల్‌ నుంచి ఈ నెల వరకూ మొత్తం 22.40 లక్షల టన్నుల ఎరువులకు గాను ఇంకా 11.70 లక్షలు రాలేదు. కేవలం 10.70 లక్షలే వచ్చాయి. యూరియాను కొంత విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నౌకాశ్రయాల నుంచి తెలంగాణకు రైళ్లలో పంపాలి. తమకు రావాల్సిన 40 వేల టన్నుల నౌక విదేశాల నుంచి ఇంకా కాకినాడ నౌకాశ్రయానికి రానందున తెలంగాణకు ఇవ్వలేకపోయినట్లు ప్రధాన ఎరువుల కంపెనీ అధికారి వెల్లడించారు. పలు కంపెనీలకు సరఫరాలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు.

సీజన్‌ ఆరంభానికి ముందు నుంచే...

దేశంలో పంటల సాగు పనులు ప్రారంభమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా, ఇతర ఎరువుల కోసం పోటీ పడుతుంటాయి. అందుకే సీజన్‌ ప్రారంభానికి ముందే అంటే వేసవిలో ఏప్రిల్‌, మే నెలల్లోనే అధికంగా తెప్పించుకుని నిల్వలు పెట్టుకుంటే జులై, ఆగస్టులలో కొరత రాకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ తెలంగాణకు గత 4 నెలల్లో పూర్తి కోటా ప్రకారం యూరియా గానీ, ఇతర ఎరువులు గానీ రాలేదు. రామగుండం ఎరువుల కర్మాగారం ఈ సీజన్‌కు ముందు ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించినా సాంకేతిక కారణాల వల్ల సరిగా సాగడం లేదు.

.

నిల్వల తనిఖీలు

రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి యూరియా, ఇతర ఎరువుల నిల్వలను తనిఖీ చేసి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో యూరియా లేదని రైతులు రోడ్లపైకి రావడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాములు, దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. పరిశీలనకు వెళ్లిన వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.రాములు మాట్లాడుతూ యూరియా కొరత రాకుండా అవసరమైనంత మేరకు సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడా కొరత లేదని వివరించారు.

.

ఏప్రిల్‌లో దేశంలో ఎరువులకు డిమాండు లేదు. ఆ నెలలో కేంద్రం తెలంగాణకు 1.08 లక్షల టన్నుల యూరియాను కేటాయించినా 30 వేల టన్నులు కోత పెట్టింది. కాంప్లెక్స్‌ ఎరువులు కూడా 40 వేల టన్నులు తక్కువే వచ్చాయి. మొత్తమ్మీద అన్ని రకాలు కలిపి 2.87 లక్షల టన్నులకు గాను 1.01 లక్షల టన్నులు రానేలేదు.

మే నెలలో 1.87 లక్షలు, జూన్‌లో 2.30 లక్షలు, జులైలో 1.32 లక్షల టన్నుల మేర ఎరువుల్లో కోత పడింది. ఇలా నెలనెలా లక్షల టన్నులు రాకపోవడం వల్ల రైతులకు అవసరమైనన్ని ఎరువుల సరఫరా కష్టమవుతోంది. గత రెండు నెలల్లో రాష్ట్రంలో సాధారణంకన్నా 47 శాతం అధికంగా వర్షాలు పడటం వల్ల యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. పత్తి అరకోటి ఎకరాలు, వరినాట్లు 40 శాతం ఎక్కువ విస్తీర్ణంలో వేసినందున యూరియా కావాలని రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇదీ చూడండి: విదేశీ ఎరువులతో పెరుగుతున్న రాయితీల బరువు

ఎరువుల కష్టాలు తీరేలా.. రైతుల ముంగిట్లోకి 'కిసాన్ యూరియా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.