ETV Bharat / state

మంత్రి మాట్లాడినా... పట్టించుకోని కేంద్రం... - లేఖ

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం దృష్ట్యా ఆగస్టు మాసం యూరియా కోటా సరఫరాలో కేంద్రం విఫలమైంది. విదేశాల నుంచి సముద్ర మార్గంలో సకాలంలో నౌకలు విశాఖపట్నం, కృష్ణపట్నం రావడం లేదు. రేవులకు వచ్చిన నౌకల్లో యూరియా కేటాయింపులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రతపై  వ్యవసాయ  శాఖ  మంత్రి  సింగిరెడ్డి  నిరంజన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాసినా స్పందించని  కేంద్రం... తమ పట్టున్న రాష్ట్రాలకు తొలుత  పంపిణీ  చేస్తోంది.  కొరత  ఉందంటూ  డీలర్లు ధరలు పెంచేసి రైతులను దోచేస్తున్నారు.

యూరియాపై మంత్రి మాట్లాడిన పట్టించుకోని కేంద్రం
author img

By

Published : Aug 27, 2019, 7:25 AM IST

Updated : Aug 27, 2019, 9:42 AM IST

యూరియా కొరత పేరిట వ్యాపారులు రైతులను దెబ్బతీస్తున్నారు. కేంద్రం... సరిగా సరఫరా చేయకపోవడం, నౌకాశ్రయాల నుంచి రైళ్ళ ద్వారా జిల్లాలకు సరఫరాలో జాప్యం వంటి కారణాలతో అన్నదాతలు రోడ్లపైకి వస్తున్నారు. మార్గం నేరుగా లేని జిల్లాల్లో కొరత ఎక్కవగా ఉంటోంది. రైళ్లల్లో జిల్లాలకు వచ్చాక.. లారీల్లో గ్రామాలకు చేర్చడం మరింత ఆలస్యం అవుతోంది. దీనిని కారణంగా చూపిస్తూ వ్యాపారుల యూరియా ధర బాగా పెంచేసి అక్రమంగా అమ్ముతున్నారు.

ఇప్పటివరకూ చేరింది 9, 900 టన్నులే..!

రాష్ట్రానికి 1.40 లక్షల టన్నుల యూరియాను విదేశాల నుంచి వచ్చే కోటా నుంచి కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వశాఖ కేటాయించింది. ఇందులో ఇప్పటివరకూ 50 వేల టన్నులు కూడా రాలేదు. పెద్ద కంపేనీలు కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. ఒక ప్రధాన కంపెనీకి ఈ నెల కోటా కింద 42 వేల టన్నులు కేటాయించారు. ఇందులో 9 వేల 900 టన్నులే జిల్లాలకు చేరింది. ఈ నెల అంతా కలిపి 20 వేల టన్నులే పంపగలమని.. మిగతాది వచ్చే నెలలో పంపిస్తామని కంపెనీ వర్గాలు తెగేసి చెప్పాయి. విదేశాల నుంచి నౌకాశ్రయానికి ఓడల్లో యూరియా వచ్చిన తర్వాత కేంద్రం.. తమకు కోటా కేటాయిస్తోందని, అందులో నుంచి ఇవ్వగలం తప్ప... అంతకు మించి తామేం చేయలేమని కంపెనీలు చేతులెత్తాశాయి.

కేంద్రంలో పట్టు ఉండటమే కారణం

ఒక్కో ప్రధాన ఎరువుల కంపెనీకి ఒక్కో నౌకాశ్రయాన్ని కేటాయించింది. అక్కడ వచ్చే నౌకల నుంచి వాటికి కేటాయించిన రాష్ట్రాలకు యూరియా తీసుకెళ్లాలి. అయితే తెలంగాణకు యూరియా పంపాల్సిన కంపెనీలకు సంబంధించిన నౌకాశ్రయాలకు విదేశాల నుంచి చాలా తక్కువగా వస్తున్నాయి. ఒక ప్రధాన కంపెనీకి కృష్ణపట్నం నౌకాశ్రయాన్ని కేటాయించింది. ఇక్కడికి గత నెల రోజుల్లో ఒక విదేశీ నౌక కూడా యూరియాతో రాలేదు. అందువల్లనే తాము తెలంగాణకు ఇవ్వలేకపోయాయమని సదరు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విదేశాల నుంచి త్వరగా తెప్పించి కంపెనీలకు కేటాయించే బాధ్యత అంతా కేంద్ర రసాయన ఎరువుల శాఖ చేతిలో ఉంది. కేంద్రంలో పట్టున్న రాష్ట్రాలు కేటాయింపుల్లో చక్రం తిప్పుతున్నారు. ఆగస్టు నెలకు రాష్ట్రానికి కేటాయించిన 1.40 లక్షల టన్నుల విదేశీ యూరియా ఇప్పటి దాకా పూర్తిగా రాకపోవడానికి ఇదే కారణం.

మంత్రి మాట్లాడినా పెరగని సరఫరా..

వర్షాలు అధికంగా పడితే... అత్యవసరంగా జిల్లాలకు పంపడానికి రాష్ట్ర మార్కెటింగ్ సహకార సమాఖ్య - మార్క్‌ఫెడ్‌ వద్ద ఎప్పుడూ 3 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం... ఆర్థిక ఆరంభంలోనే ఆదేశించింది. అయితే ప్రస్తుతం కేవలం 65 వేల టన్నులే ఈ సమాఖ్య గోదాముల్లో ఉంది. కంపెనీల నుంచి సరిగా రాకపోవడం వల్ల నిల్వలు తగ్గినట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కేటాయించిన మేరకు వెంటనే సరఫరా చేయడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శితో నేరుగా మాట్లాడినా... ఇంత వరకూ సరఫరా పెరగలేదు. రైతులకు విక్రయించే 45 కిలోల యూరియా బస్తా గరిష్ఠ చిల్లర ధర కాగా ఇప్పుడు కొరత ఉందనే ప్రచారం ఎక్కువ చేస్తూ 350 రూపాయలు దాకా వసూలు చేస్తూ రైతులను దోచేస్తున్నారు.

మంత్రి మాట్లాడినా... పట్టించుకోని కేంద్రం...

ఇవీ చూడండి: "ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్రరాజ్యాలు సమష్టిగా ముందుకెళ్లాలి

Intro:Body:Conclusion:
Last Updated : Aug 27, 2019, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.