యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పరీక్షలు నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ... పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేశారు. అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. పరీక్షా హాలుకు వెళ్లే ముందే థర్మల్ స్క్రీనింగ్ చేసి.. లోపలికి పంపించారు.
ఇదీ చదవండి: కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం!