ప్రపంచ పర్యటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని రాష్ట్ర పర్యాటకాభివృద్ది శాఖ కార్యాలయంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ దయానందగుప్తాతో పాటు పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులను వాడుకోని వదిలేశారని... సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో 33 జిల్లాలలో టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్