ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, అంతర్జాతీయ ఆర్యవైశ్య సమాఖ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వీకరించారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఆయన నివాసంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండియా అశోక్ అగర్వాల్‌కు ఈ ఛాలెంజ్‌ను విసిరారు.
ఆయన కూడా మూడు మొక్కలను నాటాలని, అలాగే మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని ఉప్పల శ్రీనివాస్ గుప్తా కోరారు. కాలుష్యం వల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పర్యావరణమే అన్నారు.
ఇవీ చూడండి: మొక్కల పెంపకం ఆహ్లాదకరం.. ఆరోగ్యకరం