ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరు బాధితుని నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. హైదరాబాద్ ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ బుద్ధానగర్ వద్ద ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్లతుండగా ప్రైవేటు ఉద్యోగి మల్లికార్జున్‌పై అకస్మాత్తుగా రావి చెట్టు కూలింది.
వెంటనే అప్రమత్తమైన సీఐ కాశీవిశ్వనాథ్.... తన సిబ్బంది సహాయంతో మల్లికార్జున్‌ను కారులో రామంతాపూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్థానికులతో కలిసి రోడ్డుపై పడిపోయిన చెట్టును పక్కకు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతోనే ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు.


