Uppal Skywalk inauguration in April : హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకి వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. కొవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. దీంతో రహదారులన్నీ వాహనాలతోనే కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటరు ప్రయాణానికే.. కొన్ని సందర్భాల్లో 15 నిమిషాల సమయం దాకా పడుతోంది. వీవీఐపీల పర్యటనలకు గాను ట్రాఫిక్ పోలీసులు తరచూ వాహనాలను నిలిపేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు రోడ్ల మీదే నిమిషాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
-
Inspected the 660 meters skywalk #Uppal X-roads, being constructed by @HMDA_Gov, costing ₹25 crs & will have 9 lifts, 3 escalators & have direct access to Metro station. This will have lighting, selective shades & street furniture
— Arvind Kumar (@arvindkumar_ias) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Will be ready by April @KTRBRS pic.twitter.com/uLhDl39kNa
">Inspected the 660 meters skywalk #Uppal X-roads, being constructed by @HMDA_Gov, costing ₹25 crs & will have 9 lifts, 3 escalators & have direct access to Metro station. This will have lighting, selective shades & street furniture
— Arvind Kumar (@arvindkumar_ias) February 28, 2023
Will be ready by April @KTRBRS pic.twitter.com/uLhDl39kNaInspected the 660 meters skywalk #Uppal X-roads, being constructed by @HMDA_Gov, costing ₹25 crs & will have 9 lifts, 3 escalators & have direct access to Metro station. This will have lighting, selective shades & street furniture
— Arvind Kumar (@arvindkumar_ias) February 28, 2023
Will be ready by April @KTRBRS pic.twitter.com/uLhDl39kNa
హైదరాబాద్‌లో.. ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏక్కువగా ఉంది?: హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కూడళ్ల వద్ద సిగ్నళ్లను దాటి వెళ్లడానికి చాలా సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మియాపూర్ చౌరస్తా, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అత్తాపూర్, నానల్ నగర్, ఉప్పల్, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిలింనగర్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది.
దిల్సుఖ్నగర్ చౌరస్తా, మెహదీపట్నం బస్టాప్‌ల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో అయితే ట్రాఫిక్‌ను కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు పాదచారులు రోడ్డు దాటేందుకు కొంత సమయం కేటాయించి, తరువాత వాహనాలు వెళ్లేందుకు సిగ్నళ్లు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కూడా పాదచారులు మధ్యమధ్యలో రోడ్డు దాటుతునే ఉన్నారు. దీని మధ్యలోనే వాహనాలు నిలిచిపోతున్నాయి.
పూర్తిస్థాయిలో భరోసా: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో ప్రయాణికులు, పాదచారుల భద్రతకుగాను పూర్తిస్థాయిలో భరోసా దక్కనుంది. కొంతకాలంగా సాగుతున్న ఆకాశమార్గం పనులు ఒక కొలిక్కి వచ్చాయి. ఏప్రిల్ నెలాఖరులోగా దీనిని అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ హెచ్‌ఎండీఏ కృత నిశ్చయంతో ఉంది. తాజాగా మంగళవారం ఈ పనులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్.. అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ మేరకు యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడలిగా ఉన్న ఉప్పల్ రింగురోడ్డులో వాహనాల రద్దీ, పాదచారుల ఇక్కట్లను గుర్తించి ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లతో ఆకాశమార్గం (స్కైవాక్) ప్రాజెక్టును రూపొందించిందన్నారు. అనంతరం ఆయన ఎల్బీనగర్-హబ్సిగూడ వరకు చేపడుతున్న పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వివరాలను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇది ఏప్రిల్‌లో ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 660 మీటర్ల పొడవు, 9 లిఫ్టులు, 3 ఎస్క్‌లేటర్లతో అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.25 కోట్లు మేర వెచ్చిస్తున్నారు.
ఇవీ చదవండి: