దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త తెలిపింది. ప్రయాణికుల ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం వరకు రాయితీని ఇస్తుంది. ఆక్టోబర్ 17 నుంచి 31 వరకు ఈ రాయితీ వర్తించనుంది. అలాగే స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తోంది.
- 20 ట్రిప్పుల ఛార్జితో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం
టీ సవారీ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి ఆఫర్ అమలు కానుంది. ఇందులో..
- 7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం
- 40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం
వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరద రోజున ఒక గర్భిణీ కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపామని తెలిపారు. ప్రస్తుతం రోడ్ల మీద ప్రయాణం కష్టంగా మారినందున.. మెట్రోలో ప్రయాణాలను ప్రోత్సహించాలని భావించామని పేర్కొన్నారు. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు అందరికీ మెట్రో ఛార్జీల్లో 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే కాకుండా ట్రిప్ కార్డులు కొన్నవారికి 2 నెలల వరకు రాయితీ ఇస్తున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు.
ఇదీ చదవండి: మెట్రో సరే.. సిటీ బస్సులెప్పుడో!!