ప్లాస్టిక్ వినియోగం, స్వచ్ఛ భారత్, అవినీతి నిర్మూలనపై ప్రజలను చైతన్యం చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గాంధీకి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశ్‌చౌక్ వద్ద గాంధీ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడబోమంటూ ఖైరతాబాద్ డివిజన్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. సంకల్పయాత్రలో చింతల రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి