ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మారావునగర్, శ్రీనివాస్నగర్లలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బన్సీలాల్పేట్లో నిర్వహించిన దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజల సహకారంతో మోదీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆపత్కాలంలో దేశ ప్రజలను ఆదుకోవడం కోసం సేవాహి సంఘటన్లో భాగంగా దేశవ్యాప్తంగా భాజపా నేతలు పెద్దఎత్తున సహాయక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ప్రజలంతా మోదీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని.. మోదీ అంతే సమర్థంగా పని చేసి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థానంలోకి తీసుకువెళతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ