ETV Bharat / state

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోంది: కిషన్​రెడ్డి - union minister kishan reddy fires on trs government

రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నట్లు తెరాస వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయకుండా తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆరోపించారు.

union minister kishan reddy fires on trs government
తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోంది: కిషన్​రెడ్డి
author img

By

Published : Oct 4, 2020, 7:43 PM IST

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోందని.. ఓవైసీ కుటుంబం పెత్తనం చెలాయిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయకుండా తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. అంబర్​పేట-బర్కత్​పురా భాజపా జిల్లా అధ్యక్షుడిగా గౌతంరావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఇకపై మజ్లిస్ పెత్తనం కొనసాగనిచ్చేది లేదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​కు కాంగ్రెస్ నేతల లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.