తెలంగాణలో రాజకీయ కేంద్రీకరణ వేగంగా జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. కేంద్రం కోపరేటివ్ ఫెడరల్ సిస్టంకు మద్దతు ఇస్తుందని... ఈ పద్ధతిలో రాష్ట్రాలు కేంద్రానితో కలిసి నడవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 370 ఆర్టికల్‌పై ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి అమిత్‌షా తనను రాష్ట్రానికి పంపినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పొల్చితే ఈసారి తెలంగాణ, బెంగాల్, ఒడిశాలో భాజపా విజయకేతనం ఎగురవేసిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: తెరాసలో ఓనర్లకు కిరాయిదారులకు గొడవ నడుస్తోంది: భట్టి