ETV Bharat / state

BJP: రామగుండం ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం కోసమే వచ్చా: భగవంత్ కుభా - తెలంగాణ వార్తలు

పేదల సంక్షేమం కోసం కేంద్రం నిరంతరం శ్రమిస్తోందని కేంద్రమంత్రి భగవంత్ కుభా(Bhagwanth Khuba) అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎరువుల గురించి వివరించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

bjp leaders meeting with union minister, union minister Bhagwanth Khuba
కేంద్రమంత్రి భగవంత్ కుభా, రాష్ట్ర భాజపా నాయకులతో కేంద్రమంత్రి సమావేశం
author img

By

Published : Aug 8, 2021, 7:20 PM IST

Updated : Aug 8, 2021, 7:34 PM IST

తెలంగాణలో 3.80మెట్రిక్ టన్నుల యూరియా(urea fertiliser), 45,000మెట్రిక్ టన్నుల డీఏపీ(D.A.P) అందుబాటులో ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా(Bhagwanth Khuba) వెల్లడించారు. ఎన్పీకే 3.29లక్షల మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 55,600మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 5 ఫర్టిలైజర్(Fertiliser) కంపెనీలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. వీటితో 12,70,000 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ భాజపా(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు సమీక్ష

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సమస్యల పరిష్కారం కోసం అక్కడ పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఏడేళ్లల్లో ఏ ప్రాంతానికీ ఎరువుల కొరత రానీవ్వలేదని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఎంత ఎరువులు కేటాయించాలో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. లెక్కలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కేంద్రమంత్రి వివరించారు. వ్యవసాయశాఖ మంత్రులు అధికారులతో రోజు సంప్రదిస్తున్నామని... ప్రతి మంగళవారం ఇక్కడి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

నేతలతో సమావేశం

నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వాగతం పలికారు. సీనియర్ నేతలు, కార్యకర్తలు కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. అందుబాటులో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధానిని ఆదర్శంగా తీసుకుని ఆయా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపైనా ఉంది. బండి సంజయ్ అధ్యక్షతన తెలంగాణలో భాజపాకు ప్రజాదరణ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో సంజయ్, పార్టీ నేతల కృషివల్ల సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేస్తే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

-భగవంత్ కుభా, కేంద్రమంత్రి

ఇదీ చదవండి: అమానవీయం.. బతికుండగానే శిశువును ఖననం చేసే యత్నం..

Last Updated : Aug 8, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.