భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah bandi sanjay news) ఫోన్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై అమిత్ షా అభినందనలు తెలిపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భాజపా కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లనే హుజురాబాద్‌లో పార్టీ గెలుస్తోందని అమిత్‌షాకు బండి సంజయ్ తెలిపినట్లు వెల్లడించాయి.
ఫలితాలపై ఉత్కంఠ
కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో పటిష్ఠ బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది. హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో 8, 11 రౌండ్లు మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్‌నగర్‌లో ఈటల ముందంజలో నిలిచారు. 15వ రౌండ్లోనూ భాజపాకు ఆధిక్యంతో కొనసాగుతోంది. 15వ రౌండ్లో భాజపాకు 2,149 ఓట్ల ఆధిక్యం లభించింది. 15 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 11,583 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు.
ఆధిక్యంలో ఈటల
14వ రౌండ్లోనూ భాజపాకు ఆధిక్యం లభించింది. 14వ రౌండ్లో భాజపా 4,836, తెరాసకు 2,971 ఓట్లు రాగా.. ఈటలకు 1,046 ఓట్ల మెజారిటీ వచ్చింది. 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా 58,333, తెరాసకు 49,945 ఓట్లు రాగా.. భాజపా 9,434 ఓట్ల ఆధిక్యంతో జోరు కనబరుస్తోంది. 13వ రౌండ్లోనూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 13వ రౌండ్లో భాజపాకు 4,836, తెరాసకు 2,971 ఓట్లు రాగా.. ఈటలకు 1,865 ఓట్ల ఆధిక్యం లభించింది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా 8,388 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది. 12వ రౌండ్లో మళ్లీ భాజపాకు ఆధిక్యం లభించింది. 12వ రౌండ్లో భాజపాకు 4,849, తెరాసకు 3,632 ఓట్లు రాగా.. ఈటలకు 1,217 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 53,497, తెరాసకు 46,974 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా 6,523 ఓట్ల ఆధిక్యంతో జోరు కనబరుస్తోంది.
ఈటల జోరు
11వ రౌండ్లో తెరాసకు 385 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్లో భాజపాకు 3,941, తెరాసకు 4,326 ఓట్లు వచ్చాయి. 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాసకు ఆధిక్యం లభించింది. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 5,306 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. 10వ రౌండ్లోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ముందజలో నిలిచారు. 10వ రౌండ్లో 526 ఓట్ల ఆధిక్యం సాధించారు. పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 5,691 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పదో రౌండ్లో భాజపాకు 4,295, తెరాసకు 3,709 ఓట్ల దక్కగా.. కాంగ్రెస్ 118 ఓట్లతో సరిపెట్టుకుంది. 10 రౌండ్లు ముగిసేసరికి మొత్తంగా భాజపాకు 44,707, తెరాసకు 39,016 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,487 ఓట్లు పడ్డాయి.
కమల వికాసం
8వ రౌండ్ మినహా మిగిలిన రౌండ్లలో ఈటలకే ఆధిక్యం తొలి ఏడు రౌండ్లలోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో నిలిచారు. రౌండ్ రౌండ్‌కు కమలం పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. 9వ రౌండ్లో ఈటల రాజేందర్ 1,835 ఓట్ల ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్లో 5,105 ఓట్లతో ముందంజలో నిలిచారు. 9వ రౌండ్లో భాజపా - 5,305, తెరాస - 3,470, కాంగ్రెస్ - 174 ఓట్లు సాధించాయి. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి భాజపా - 40,412, తెరాసకు - 35,307 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలో ఈటలే ఆధిక్యంలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్లో తెరాసకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. 8వ రౌండ్ 162 ఓట్ల ఆధిక్యంతో గులాబీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 3,270 ఓట్ల అధిక్యంతో ఉన్నారు. 8వ రౌండ్లో భాజపా - 4,086, తెరాస - 4,248, కాంగ్రెస్ - 89 ఓట్లు సాధించాయి. 8 రౌండ్లు ముగిసేసరికి 1,175 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు చేసిన గ్రామం శాలపల్లిలోనూ కమలం పార్టీనే ముందంజలో నిలిచింది. ఈ గ్రామంలో భాజపాకు 312 ఓట్లు రాగా.. తెరాసకు 175 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి: Etela Rajender leads : మొదటి నుంచి ఈటలదే జోరు.. ఏఏ రౌండ్లో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయంటే?