NEET 2021 CUTOFF : నీట్ 2021 పీజీ వైద్యవిద్య కటాఫ్ మార్కులను 15 పర్సంటైల్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకొంది. దీంతో జనరల్ అభ్యర్థులకు 35 పర్సంటైల్ 247 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 25 పర్సంటైల్ 210 మార్కులు, దివ్యాంగులకు 30 పర్సంటైల్ 229 మార్కులుగా నిర్ణయించింది.
కటాఫ్ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం మరోసారి ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధి కళాశాలలతో పాటు నిమ్స్‌లోనూ పీజీ వైద్యవిద్యను అభ్యసించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 16న ఉదయం 8 నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇదీచూడండి: Telangana Inter Exams: మేలో ఇంటర్మీడియట్ పరీక్షలు?