vizag steel plant for sale: ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం 100 శాతం ప్రైవేటీకరణకే కేంద్ర కేబినెట్ సూత్రప్రాాయ ఆమోదం తెలిపింది. కర్మాగారానికి అనుబంధంగా ఉన్న సంస్థలు, జాయింట్ వెంచర్‌లో ఉన్న వాటాలు కూడా పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కర్మాగారం విస్తరణ ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని.. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే రాజ్యసభ సాక్షిగా తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
సమగ్ర ఒప్పందం..: కోక్ ఓవెన్ బ్యాటరీల మరమ్మతు, నిర్వహణ కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు ప్రత్యామ్నాయంగా ఒక సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్లాంట్ మెరుగైన పనితీరుకు, ఆశించిన లాభాల దిశగా.. సాగేందుకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు, వాటాదారులందరి అంచనాలను అందుకోవడానికి అందరికి అవకాశం ఇస్తున్నట్లు మంత్రి సమాధానం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం..: కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, హింథుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య 2017 జనవరిలో అవగాహన ఒప్పందం జరిగిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు సాధ్యతక వయబులిటీ గ్యాప్ ఫండ్ అవసరం అని సమగ్ర అధ్యయనం తేల్చినట్లు తెలిపారు. ఆశించిన గ్యాప్ ఫండ్‌ను భరించేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి బదులిచ్చారు.
ఇవీ చదవండి :
అదానీ వివాదంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు