ETV Bharat / state

Cyclone Gulab: రాష్ట్రవ్యాప్తంగా గులాబ్​ ప్రభావం... జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు - Gulab cyclone effect on telangana

గులాబ్‌ తుపాను (Cyclone Gulab) ప్రజల్లో గుబులు సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల(Siricilla)ను వరద మరోసారి ముంచెత్తింది. 14 గంటల్లో సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.13 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఈరోజూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం... ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల వారీగా కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసింది.

rains
గులాబ్
author img

By

Published : Sep 28, 2021, 5:23 AM IST

గులాబ్ తుపాను (Cyclone Gulab) ప్రభావంతో జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 18.13 సెంటిమీటర్ల వర్షం కురవగా... ఖమ్మం జిల్లా వైరాలో 14.2 సెంటీమీటర్లు నమోదైందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వర్షానికి చాలాకాలనీలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్‌, శాంతినగర్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో శాంతినగర్ అంబేడ్కర్‌నగర్ నీటమునిగింది.

సిరిసిల్ల-కరీంనగర్ రోడ్డులోని దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ విభాగాల అధికారులు సమన్వయంతో సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పునారావస కేంద్రానికి తరలించారు. స్థానిక కౌన్సిలర్ల సమన్వయంతో అధికారులు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి అనవసరంగా బయటికి వెళ్లవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో రెండురోజుల పాటు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో... లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రవాహం ఎక్కువైతే నీటి విడుదలకు అధికారుల నిర్ణయించారు. రెండ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని బంగారుగూడ వాగు ఉప్పొంగడంతో వంతెన వరద నీటితో మునిగింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి మండలం లింగాయిపల్లి మొండివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో కామారెడ్డి-రాజంపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం వాడి, పరిధిపేట్ గ్రామాల మధ్య లొట్టి వాగు జోరుగా ప్రవహిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వాతావరణశాఖ రెడ్‌అలర్ట్ ప్రకటించినందున మంత్రి ప్రశాంత్ రెడ్డి... అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల కలెక్టర్లతో ఫోన్​లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నీట మునిగిన పంటలు...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వానకు చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయి. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయి గూడెం మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి సింగరేణి కాలరీస్‌లోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వర్షపునీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అశ్వాపురం మండలం మొండికుంట - భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచాయి. లోతు వాగు ఉప్పొంగడంతో సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. భారీ వర్షాలకు ఖమ్మం నగర శివారులోని గొలుసుకట్టు వాగులు పొంగి పోర్లుతున్నాయి. వైరాలోని ఇందిరమ్మ కాలనీలో వరదనీరు పోటెత్తింది. ఏళ్లుగా ఇదే సమస్య ఉందని తమ బాధలు పరిష్కరించాలంటూ కాలనీ వాసులు ఆందోళన చేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని పలు మండలాల్లో వందల ఎకరాల పొలాలు నీటమునిగాయి.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు...

జోరు వానకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భువనగిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పహడినగర్‌లోని పలు ఇళ్లలోకి వరద రావటంతో వస్తువులు నీట మునిగాయి. రాయగిరి ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. వరద ధాటికి ఓ బైక్ అండర్ పాస్ కింది నుంచి కొట్టుకొనిరాగా స్థానిక యువకులు బైక్‌ని పట్టుకున్నారు. చిన్నేటివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బీబీనగర్- భూదాన్ పోచంపల్లి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ మండలం భీమలింగం వద్ద మూసీకి వరద పోటెత్తడంతో భువనగిరి- వలిగొండ మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో సహయక చర్యల కోసం జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో నర్సాపూర్ పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి. మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద రైల్వే వంతెన కింద భారీగా వర్షపు నీరు చేరటంతో వాహనాలను దారి మళ్లించారు.

పరీక్షలు వాయిదా...

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు వాయిదా (Exams Postponed) వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra reddy)తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత వెల్లడించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జేఎన్​టీయూహెచ్ (JNTUH) పరిధిలోని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈనెల 30న జరగాల్సిన వ్యాయామ విద్య శారీరక ధారుడ్య పరీక్షలు వాయిదా వేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన శారీరక ధారుడ్య పరీక్షలను అక్టోబరు 23కి వాయిదా వేసినట్లు కన్వీనర్ వెల్లడించారు.

ఇదీ చదవండి : Gulab Cyclone Effect on Telangana: రాష్ట్రంలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.