రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేయాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి రోడ్డు నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం... వారి త్యాగాలను విస్మరించిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.