కోవిదా సౌహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెంపుడు జంతువుల పెంపకంపై యాజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాలకు చెందిన పెంపుడు జంతువులకు పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలో శునకరాజులు నడక, అందంతో అలరించాయి. ప్రస్తుతం పెంపుడు జంతువులు మనలో ఒక భాగంగా మారిపోయిందని.. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కోవిదా సౌహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూహ్యరెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు మానవ సేవ, మాదవసేవ చేశారని... అదే విధంగా పెంపుడు జంతువులను, పక్షులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ షోను నిర్వహించినట్లు చెప్పారు.