ETV Bharat / state

Typewriting Course Telangana : కనుమరుగవుతున్న టైపింగ్ శిక్షణ.. ప్రభుత్వ కొలువులకు అదే కీలకం - స్టెనోగ్రఫీ శిక్షణ

Typewriting Course Telangana : ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా, ప్రైవేట్‌సంస్థలో సాధారణ ఉద్యోగానికి డిగ్రీపట్టాతోపాటు టైపింగ్ అదనపు అర్హతను అడిగేవారు. క్లెర్క్ పోస్టుల్లో ఎక్కువ భాగం, స్టెనోగ్రఫీ ఉద్యోగాలకు టైప్ రైటింగ్ కోర్సు పూర్తిచేసినవారే అర్హులు. వాటిపై శిక్షణ కోసం.. పట్టణాల్లో ప్రత్యేక కేంద్రాలుండేవి. కంప్యూటర్లు వచ్చాక టైప్‌రైటర్లతోపాటు శిక్షణ ఇచ్చే సంస్థలు క్రమంగా మూతబడ్డాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చే టైపింగ్ సర్టిఫికేట్ కావాలంటే పాతకాలపు మెషిన్లపైనే నేర్చుకోవాల్సి వస్తోంది. వాటికి ఆదరణ తగ్గినా వాటినే నమ్ముకున్నవారు మాత్రం ఇంకా శిక్షణ కొనసాగిస్తూనే ఉన్నారు.

Telangana Latest News
Typing Course Problems
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 2:10 PM IST

Declining of Typing Courses in Hyderabad కనుమరుగవుతున్న టైపింగ్ శిక్షణ.. ప్రభుత్వ కొలువలకు అదే కీలకం

Typewriting Course Telangana : సాంకేతికతతో ప్రపంచవ్యాప్తంగా.. అన్నిరంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం యువత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. గతంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఉద్యోగానికి దరఖాస్తు, పరీక్షా ఫలితాలు(Exam Results), వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు, చట్టసభల్లో కార్యకలాపాల నమోదు అన్నీ టైప్ రైటింగ్ మెషిన్ ద్వారానే జరిగేవి.

Declining of Typing Courses in Hyderabad : ఇప్పుడు క్రమంగా వాటి స్థానాన్ని కంప్యూటర్లు ఆక్రమించాయి. వాటివాడకం సులభంగా ఉండటమే కాకుండా తప్పు జరిగితే సరిచేసే అవకాశం ఉండడంతో ఖర్చు ఎక్కువైనా సంస్థలతో పాటు వ్యక్తులు కంప్యూటర్లనే వినియోగిస్తున్నారు. తద్వారా టైప్ రైటర్లు అంతరించిపోయే దశకు చేరాయి. ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ లోయర్, టైపింగ్ హయ్యర్ వంటి పరీక్షలకు టైపింగ్‌ తప్పనిసరి కావడం వల్ల కొద్దిమంది యువత ఇంకా నేర్చుకుంటోంది.

Hand Pain When Typing Relief Tips : టైపింగ్ చేస్తుంటే చేతిలో నొప్పి వ‌స్తుందా?.. ఈ 6 టిప్స్​తో ఫుల్ రిలీఫ్​!

Typing Practice : ఏ డిగ్రీ చేసినా, పీజీ చేసినా టైపింగ్ స్కిల్ అనేది ఉండాలని విద్యార్థులు భావిస్తున్నారు. కంప్యూటర్(Computer Knowledge) నేర్చుకున్నప్పటికీ.. నేరుగా దానిపై వేగంగా టైపింగ్ చేయాలంటే కష్టమవుతుంది. టైపింగ్ మిషన్ మీద నేర్చుకుంటే వేగంతో పాటు కచ్చితత్వం అనేది వస్తుంది. సాధారణ వ్యక్తులు గంటలో చేసే పనులను.. టైపింగ్ నేర్చుకున్న విద్యార్థులు అరగంటలో చేయగలరని నిర్వాహకులు భావిస్తున్నారు.

"నేటి తరానికి ఉద్యోగంలో టైపింగ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ఇంతకముందు డిగ్రీ చదివినవాళ్లు మాత్రమే టైపింగ్ నేర్చుకునేవాళ్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్హతలతో సంబంధం లేదు. నాది బీటెక్ పూర్తైంది. కేంద్ర కొలువులను కొట్టేందుకు టైపింగ్ కచ్చితంగా ఉండాల్సిందే.. గతంలో రెండుసార్లు టైపింగ్​లో ఫెయిల్ అవ్వటంతో జాబ్ పొందలేకపోయాను." సత్య లలిత,టైపింగ్ ట్రైనీ

Typing Course Problems : స్టెనోగ్రఫీ అనేది ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. కేంద్రప్రభుత్వ(Central Government Jobs) ఉద్యోగాలు, న్యాయస్థానాల్లోనూ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉండేవి. ప్రస్తుతం మరుగున పడిపోతున్న టైపింగ్, స్టెనోగ్రఫీలను ప్రభుత్వ చొరవతో మళ్లీ పునరుద్ధరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్‌తో పాటు స్టెనో విద్యార్హతకు అదనపు నైపుణ్యంగా ఉంటుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో నిర్వహించే ఉద్యోగ నియామకాల్లోనూ టైపింగ్ అర్హతగా పెట్టి ఉద్యోగ కల్పనచేస్తే విద్యార్థులతోపాటు టైపింగ్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులకు ఉపాధి(Employment) కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో లక్షలసంఖ్యలో టైపింగ్‌ నేర్చుకుంటుండగా తెలుగురాష్ట్రాల్లో వేలకే పరిమితమైంది.

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొలువులకు సంబంధించి టైపింగ్ టెస్ట్​లో నిమిషానికి సుమారు 30,40 పదాలు వంటి నైపుణ్యాన్ని అడిగితే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. కానీ ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. మేము శిక్షణను క్రమబద్దంగా నేర్పిస్తాం. టైపు నేర్చుకున్నవాళ్లకు, నేర్చుకొనని వారికి కొంచెం తేడా అయితే తెలుస్తుంది. మున్ముందు వారి జాబుల్లో ఈ శిక్షణనేది అక్కడ ఉపయోగపడుతుంది". - సతీశ్, టైపింగ్ సంస్థ నిర్వాహకుడు

ముక్కుతో దివ్యాంగుడి టైపింగ్​.. నిమిషానికి 36 పదాలతో రికార్డు.. ఇండియా బుక్​లో చోటు

కీబోర్డ్​ను ముట్టుకోకుండా.. కంప్యూటరే టైప్ చేస్తే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.