4 Murders in Hyderabad today : రోజురోజుకు రాష్ట్రంలో నేరాలు ఎక్కువైపోతున్నాయి. హత్యలు చేసేవారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం నేరాలు తగ్గించడానికి ప్రజల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. రోజులో ఎక్కడో హత్యలు.. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట నేరాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నా.. ఈ ఘటనలకు అడ్డుపడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఒకే రాత్రి నలుగురు హత్యకు గురవ్వడం కలంకలం సృష్టించింది.
Two Transgenders Murder At Dainagh : హైదరాబాద్‌లో తాజాగా ఒకేరోజు వేరువేరుచోట్ల నాలుగు హత్యలు చోటుచేసుకున్నాయి. ఓ ఘటనలో ఇద్దరు ట్రాన్స్ జెెండర్లు హత్యకు గురయ్యారు. మరో ఘటనలో రోడ్డుపై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాయితో మోదీ దుండగులు హతమార్చారు. ఒకే రాత్రి నలుగురు హత్యకు గురవ్వడం నగరంలో కలకలం సృష్టించింది. జంట హత్యల నేపథ్యంలో స్థానిక ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ టప్పాచబుత్రలో బుధవారం రాత్రి దారణం చోటుచేసుకుంది. దైబాగ్ ప్రాంతంలో ఇద్దరు హిజ్రాలు దారుణహత్యకు గురయ్యారు. మృతులు యూసూఫ్ ఎలియాస్ డాలి, రియాజ్ ఎలియాస్ సోఫియాగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరిని కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోదీ హత్య చేశారని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.... జంట హత్యలపై ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలంలో ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మండల డీసీపీ కిరణ్ పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
'రోజు దైబాగ్ టప్పాచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జంట హత్యలు జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ఇక్కడికి వచ్చాం. మృతులు ఇద్దరు ట్రాన్స్జెండర్లు.. వారి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారు ఈ ప్రాంతానికి చెందినవారే. కేసు నమోదు చేసుకుని మేం దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సన్నిహిత్యం కారణంగా హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నాం. దాని ప్రకారమే అనుమాతుల్ని అదుపులోకి తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటాం. బాధితుల్ని బండరాయితో, కత్తులతో పొడిచి చంపారు. కత్తిని స్వాధీనం చేసుకున్నాము. క్లూస్ టీమ్ కూడా వచ్చింది.'-కిరణ్, దక్షిణ మండల డీసీపీ
Two People Murdered At Rajendranagar : రాజేంద్రనగర్‌లో వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. కాటేదాన్‌లోని వేరువేరు చోట్ల ఇద్దరు వ్యక్తులను దుండగులు హత్య చేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాయితో మోదీ దుండగులు హతమార్చారు. ఈ జంట హత్యల ఉదంతంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: