ETV Bharat / state

సోడా గ్యాస్​ సిలిండర్​ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు

సోడా గ్యాస్​ సిలిండర్​ పేలి ఇద్దరు తీవ్ర గాయాల పాలైన ఘటన హైదరాబాద్​ కూకట్​ పల్లిలో జరిగింది. గాయపడ్డవారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో సిలిండర్​ తగిలి ఓ కారు ముందు భాగం కూడా ధ్వంసమైంది.

పేలిన సిలిండర్​
author img

By

Published : May 13, 2019, 7:21 PM IST

ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి , ఓ బాలుడు గాయపడిన ఘటన కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రగతి నగర్​లో శీతల పానీయాలు విక్రయించే అనిల్​ అనే వ్యక్తి ఖాళీ అయిన సిలిండర్​ను మార్చుకునేందుకు హర్షిత్​ అనే బాలునితో ద్విచక్ర వాహనంపై కూకట్​పల్లికి వచ్చాడు. కాలనీలో 4వ ఫేజులో గ్యాస్​ నింపించాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా మంజీరా మాల్​ వద్ద సిలిండర్​ రోడ్డుకు తగిలి ఒక్కసారిగా పేలింది. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సిలిండర్​ తగిలి.. రోడ్డుపై వెళ్తున్న కారు ముందు భాగం కూడా ధ్వంసమైంది.

సిలిండర్​ పేలి ఇద్దరికి గాయాలు

ఇదీ చూడండి : వాహనదారుని అజాగ్రత్త.. ఐదేళ్ల బాలుడు మృత్యువాత..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.