ETV Bharat / state

Three Persons Died in Wall Collapse in Hyderabad : కూలిన గోడ.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 9:51 AM IST

Updated : Sep 7, 2023, 7:07 PM IST

Three Persons Died in Wall Collapse
Three Persons Died in Wall Collapse in Hyderabad

09:45 September 07

Three Persons Died in Wall Collapse in Hyderabad : కూలిన గోడ.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Three Persons Died in Wall Collapse in Hyderabad కూలిన గోడ ముగ్గురు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం

Three Persons Died in Wall Collapse in Hyderabad : హైదరాబాద్‌ కేపీహెచ్​బీలోని అడ్డగుట్టలో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనం గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో ముగ్గురు కూలీలు.. మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు(Doctors) వెల్లడిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఆరో అంతస్తును అధికారులు కూల్చివేస్తున్నారు. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెలవు రోజు కావటంతో రహదారిపై రద్దీ లేక భారీ ప్రాణనష్టం తప్పింది.

Wall Collapse in Hyderabad Updates : హైదరాబాద్‌ కేపీహెచ్​బీ అడ్డగుట్టలో భవనం పైఅంతస్తు గోడ కూలిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు(Three Laborers Died in Wall Collapse Accident) ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అడ్డగుట్టలో సర్వే నంబర్ 176పీ, 177పీ, 182పీలోని 668 గజాలలో ఐదు అంతస్తుల అనుమతి తీసుకొని, అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు. దానిని నిర్మించేందుకు ఒడిశా నుంచి కూలీలు వచ్చి.. అక్కడే నివాసం ఉంటూ పనిచేస్తున్నారు.

Construction Building Wall Collapse in Hyderabad : భవన నిర్మాణం పూర్తై.. ఆరవ అంతస్తుపై పిట్టగోడ నిర్మించేందుకు రోజులాగే ఇవాళ కూడా పనిలోకి వెళ్లారు. భవనానికి వెలుపల పరంజి ఏర్పాటు చేసి నిర్మింస్తుండగా.. ఒక్కసారిగా పిట్టగోడపై ఉన్న సిమెంటు ఇటుకలు కూలడం ప్రారంభమయ్యాయి. ఆ ఇటుకలు కిందనే ఉన్న కూలీలపై పడ్డాయి. దీంతో ఆరవ అంతస్తున ఉన్న ఇద్దరు కూలీలు నేరుగా రోడ్డుపై పడ్డారు. మరో ముగ్గురు విద్యుత్‌ తీగలపై పడి కిందకు జారారు. కూలీలపై ఇటుకలు పడటంతో తీవ్ర గాయలై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ శబ్దం రావడంతో గమనించిన స్థానికులు గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరో కూలీ మృత్యువాత పడ్డాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది.

Wall Collapse in Hyderabad Death Toll : ప్రమాదానికి కారణమైన భవనం అనుమతులకు విరుద్ధంగా కడుతున్నారు. భవనానికి 5 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా.. యజమానులు ఆరవ అంతస్తును నిర్మిస్తున్నారని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని.. గతంలో పలు మార్లు ఫిర్యాదులు ఇచ్చిన కూడా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కాగా ఘటనా స్థలాన్ని స్థానిక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi).. జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్​తో కలిసి పరిశీలించారు. ఘటన చాలా బాధాకరమని.. బాధ్యులు ఎవరైరా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. భవన యజమానులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారన్నారు. దీంతో పాటు మేయర్​ని సంప్రదించి మృతులు కటుంబాలకు అండగా ఉంటామని వెల్లడించారు.

Auto Driver Killed by Falling Tree Live Video : ఆటోలపై కుప్పకూలిన భారీ వృక్షం.. డ్రైవర్‌ మృతి

College Bus Hits GHMC Worker Hyderabad : కాలేజ్ బస్సు ఢీకొని GHMC కార్మికురాలు మృతి.. వీడియో వైరల్

Last Updated : Sep 7, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.