ETV Bharat / state

పింఛన్​ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు! - 8 రోజులుగా శ్మశానంలోనే నివాసం - ELDERLY WOMAN ABANDONED BY SONS

రాజవ్వ అనే వృద్ధురాలిని శ్మశానంలో వదిలేసిన కుమారులు - 8 రోజులుగా వృద్ధురాలు శ్మశానంలో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు - ఆసుపత్రికి తరలింపు

Elderly Woman Abandoned Alive At Cemetery
Elderly Woman Abandoned Alive At Cemetery (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 5:19 PM IST

Elderly Woman Abandoned Alive At Cemetery : పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారే సర్వస్వంగా, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలకు ఏ ఆపదా రాకుండా కంటికి రెప్పలా వారి బాగోగులు చూసుకుంటారు. వారికి ఏ చిన్నకష్టం వచ్చినా సరే కన్నవారు ప్రాణం పోయేంతలా విలవిలలాడిపోతారు. తీరా వారు పెద్దయిన తర్వాత అమ్మనాన్నాలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు.

కన్నవాళ్ల నుంచి ఆస్తులు కావాలి, కానీ కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని పెంచి పెద్ద చేసిన పాపానికి చివరికి ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో కనీసం తిండి కూడా పెట్టడం లేదు. ఇలాంటి ఘటనే జగిత్యాలలో జరిగింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ తల్లిని శ్మశానంలో వదిలేసిన అమానవీయ ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది : బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాలకు చెందిన రాజవ్వ అనే వృద్ధురాలికి నలుగురు కుమారులు ఉన్నారు. అయితే తన యోగక్షేమాలను కుమారులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్​ డబ్బుల కోసమని తన కుమారుడు చితకబాదినట్లుగా బాధితురాలు తెలిపారు. గత ఎనిమిది రోజులుగా జగిత్యాల పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఆమె ఉంటున్నట్లుగా గుర్తించిన వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు ఆమె వద్దకు వెళ్లి వివరాలను సేకరించి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై వయోవృద్ధుల సంక్షేమాధికారి నరేశ్ స్పందించారు. చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వేడి అన్నం పెట్టమన్నందుకు ఆ కుమారులు తండ్రిని ఏం చేశారో చూడండి?

'నువ్వు బతికుంటే నాకు పెళ్లి జరగదు - అందుకే చచ్చిపో' - తండ్రిని హతమార్చిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.