ETV Bharat / state

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు - new mandal in mahabubnagar district

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో మహమ్మదాబాద్​, వికారాబాద్​ జిల్లాలో చౌడాపూర్​ పేరిట కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తెలంగాణలో కొత్త మండలాలు
తెలంగాణలో కొత్త మండలాలు
author img

By

Published : Apr 24, 2021, 6:21 PM IST

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. మహబూబ్​నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ పేరిట కొత్తగా మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గండీడ్ మండలంలోని పది గ్రామాలతో మహమ్మదాబాద్ మండలం ఏర్పాటైంది. మహమ్మదాబాద్, సంగాయిపల్లి, అన్నరెడ్డిపల్లి, ముకర్లబాద్, లింగాయిపల్లి, మంగంపేట, చౌదర్​పల్లి, గండిర్యాల, నంచెర్ల, జూలపల్లి గ్రామాలు ఈ మండలంలో ఉంటాయి.

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఏడు, మహబూబ్​నగర్ జిల్లా నవాబ్​పేట మండలంలోని మరో ఏడు గ్రామాలతో చౌడాపూర్ పేరిట కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. చౌడాపూర్, మండిపాల్, వీరాపూర్, విఠలాపూర్, మక్త వెంకటాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి, కొత్తపల్లి, పురుసంపల్లి, మల్కాపూర్, మరికల్, కన్మన్​కాల్వ, మొగిల్లపల్లి, చాకల్​పల్లి గ్రామాలు ఈ మండలంలో ఉంటాయి. ఈ మండలం వికారాబాద్ రెవెన్యూ డివిజన్​లో ఉంటుంది.

ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.