ETV Bharat / state

ఏపీలో విజృంభిస్తోన్న వైరస్... మరో ఇద్దరు ఎంపీలకు కరోనా

ఆంధ్రప్రదేశ్​లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లగా... వారికి పాజిటివ్ నిర్ధరణ అయింది.

two-mps-of-andhrapradesh-tested-positive-for-covid
ఏపీలో విజృంభిస్తోన్న వైరస్... మరో ఇద్దరు ఎంపీలకు కరోనా
author img

By

Published : Sep 14, 2020, 11:14 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారిన పడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్​గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కూడా కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో.. రెండు వారాల పాటు దిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

ప్రశ్నోత్తరాల రద్దుపై లోక్​సభలో చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.