ETV Bharat / state

వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణమా? - జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాత్రి జూబ్లీహిల్స్​ కూడలి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనగా.. నార్సింగ్​ పరిధిలోని అల్కాపూర్​లో కారు బోల్తాపడి ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

two car accidents in hyderabad
వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంగా నడపడమే కారణమా?
author img

By

Published : Feb 19, 2020, 8:37 AM IST

హైదరాబాద్​ నగరంలో ప్రజలు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ... ప్రమాదాలకు కారణమవుతున్నారు. మంగళవారం రాత్రి నగరంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

జూబ్లీహిల్స్​ కూడలి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొంది. కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

నార్సింగ్ పీఎస్ పరిధిలోని అల్కాపూర్​లో ఓ కారు బోల్తాపడి నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపటం, మెరుపు వేగంతో ప్రయాణించడం వల్లే నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంగా నడపడమే కారణమా?

ఇదీ చదవండిః కరోనా పంజా: చైనాలో 2 వేలకు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.