ETV Bharat / state

KTR Tweet: రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు! - KTR Tweet on kishan reddy

KTR Tweet: తెరాస, భాజపా ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరస్పరం విమర్శలు కురిపించారు. ప్రధాని హాజరైన సమతా స్ఫూర్తి వేడుకలను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్న కిషన్ రెడ్డి... హిందూ వ్యతిరేక ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్న వారు అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మోదీని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంపై వివక్షను ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని కిషన్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్... తాము రాష్ట్రానికి అండగా.. భాజపా దేశానికి దండగ అని వ్యాఖ్యానించారు.

KTR
KTR
author img

By

Published : Feb 7, 2022, 8:58 PM IST

Updated : Feb 7, 2022, 10:45 PM IST

KTR Tweet: సమతా మూర్తి విగ్రహాన్ని.. వివక్షకు ప్రతిరూపం ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్రమోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్​పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేత ఎన్.రామచంద్రరావు స్పందించారు. రామానుజాచార్యల సమానత్వ స్ఫూర్తి వేడుకల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి రాజకీయ దాడులను ఎన్నో ఎదుర్కొన్నారన్న కిషన్ రెడ్డి... అయితే రామానుజార్యులను వదలిపెట్టాలన్నారు. పదిహేను నిమిషాల సమయం ఇస్తే వందల కోట్ల హిందువులను చంపుతామన్న ఎంఐఎంతో కలిసి పనిచేస్తూ.. అందరి వెంట ఉండే అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తారా అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

  • మొన్న..
    ITIR ఇవ్వకున్నా..
    దిగ్గజ ఐటి కంపెనీలు తెచ్చుకున్నం

    నిన్న..
    జాతీయ హోదా ఇవ్వకున్నా..
    కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం

    నేడు..
    కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
    ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నం

    ఒక్క మాటలో
    చెప్పాలంటే,

    రాష్ట్రానికి అండగా మేము..
    దేశానికే దండగ మీరు!!! https://t.co/6MweRhEpVH

    — KTR (@KTRTRS) February 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేటీఆర్ కౌంటర్...

దానిపై స్పందించిన కేటీఆర్ రాష్ట్రంపై కేంద్రం ఉదాసీనతను ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నారని కిషన్ రెడ్డిని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పథకాలను ప్రస్తావించిన కేటీఆర్.. వాటిపై కేంద్రం ఉదాసీనతపై వివరణ ఇవ్వాలన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మరో ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి.. పాతబస్తీలోని వందల ఆలయానికి ధ్వంసం చేసిన చరిత్ర ఉన్న ఎంఐఎం మద్దతుతో కుటుంబపాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.

దానిపై స్పందిస్తూ భాజపా దేశానికి దండగ అంటూ ధ్వజమెత్తిన కేటీఆర్.. రాష్ట్రానికి తాము అండగా ఉన్నామన్నారు. ఐటీఐర్ ఇవ్వకపోయినా దిగ్గజ ఐటీ కంపెనీలను తెచ్చుకున్నామని... జాతీయహోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నామని... కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ కట్టుకున్నామన్నారు.

సమతామూర్తే ప్రతీక...

కేటీఆర్ వాస్తవానికి దూరంగా ఉంటారన్న మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు... భాగ్యనగరానికి సమతామూర్తి విగ్రహమే ప్రతీకగా ఉండబోతోందని.. చార్మినార్ కాదని ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు. కుటంబ రాజకీయాలకు రాయబారులు సమానత్వంపై మాట్లాడుతున్నారన్నారు. గాడ్సే భక్తులకు మత సామరస్యం వంటి పదాలు అర్థం కావని.. మత వైర్యుధ్యాల కన్నా కుటంబ రాజకీయాలు చెడ్డవి కావని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 7, 2022, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.