రాష్ట్రంలో కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమరభేరిలో పాల్గొన్న రమణ... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సమ్మె ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికులు ఎంత ఐక్యంగా ఉన్నారో... ఇకముందూ అంతే ఐక్యంగా ఉండాలని సూచించారు. కుట్రలకు మోసపోకుండా కార్మికులు ఉద్యమించాలన్నారు. ఆర్టీసీ ఆస్తులను అనుచరులకు కట్టబెట్టాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!