ఆర్టీసీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తున్న కార్మికుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం సరికాదని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ విమర్శించారు. రాష్ట్రంలో చివరకు గవర్నర్ను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన వంతెన కేవలం తెరాస అనుయాయులకు ఉపయోగపడేలా నిర్మించారని రమణ ఆరోపించారు. ఇటీవల వంతెనపై నుంచి కారు పడిన ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణం సాయం చేయాలని రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం'