కరోనా సమయంలో రోగుల కోసం ఏర్పాట్లు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా అభిప్రాయపడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెతెదేపా అధ్యక్షులు ఎల్.రమణ జాతీయ జెండాను, అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేసిన గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్.. ఈరోజు కరోనా చికిత్స కోసం ఉపయోగపడిందని రమణ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయటం సహా.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని విషయాల్లోనూ సర్కారు విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.