ETV Bharat / state

TTD Board Members: 25 మందితో టీటీడీ పాలక మండలి.. తెలంగాణ నుంచి ఐదుగురు - ap news

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం నియమించింది. 24 మంది సభ్యులతో పాటు నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యుల్ని నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించింది.

ttd-to-release-list-of-governing-body-members

author img

By

Published : Sep 16, 2021, 7:27 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని అందులో పేర్కొంది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డు(ttd board)లో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని ఇదివరకే నియమించినందున మిగిలిన 24 మంది సభ్యుల జాబితాను బుధవారం ప్రకటించింది.

వారికి మళ్లీ అవకాశం

బోర్డు సభ్యుల సంఖ్యను పెంచనున్నారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం సాగింది. బుధవారం కూడా వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. పలు చర్చల తర్వాత పాత బోర్డులాగే సభ్యుల సంఖ్యను 25గానే కొనసాగించాలని నిర్ణయించారు. గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు శ్రీనివాసన్‌, జూపల్లి రామేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలను ఇప్పుడూ కొనసాగించారు. అలాగే వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలంగాణ నుంచి మురంశెట్టి రాములు, లక్ష్మీనారాయణ తదితరులకు కూడా వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. ఈసారి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు.

గత బోర్డులో సభ్యులుగా పనిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లకు చోటు కల్పించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అవకాశం ఇచ్చినట్లు బుధవారం రాత్రి వరకూ అధికారిక వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆయన స్థానంలో సంజీవయ్యకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు బోర్డులో స్థానం కల్పించారు.

సభ్యులు వీరే:

పోకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతిప్రసాద్‌, మన్నే జీవన్‌ రెడ్డి, డాక్టర్‌ బండి పార్థసారథి రెడ్డి, డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేష్‌ శర్మ, బి.సౌరభ్‌, మూరంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే), ఏపీ నందకుమార్‌, పచ్చిపాల సనత్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి(ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (ఎమ్మెల్యే, కనిగిరి), కిలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే, సూళ్లూరుపేట), కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (ఎమ్మెల్యే, పాణ్యం)

  • తితిదే ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకమనేది సీఎం, ప్రభుత్వ నిర్ణయమేనని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుందని, బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

తితిదేకి 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించినంత వరకు వారిని తితిదే పాలకమండలి సభ్యులతో సమానంగా పరిగణిస్తారని తెలిపింది. ఇప్పుడు నియమించిన తితిదే పాలకమండలి పదవీకాలంతో పాటు, తితిదే ప్రత్యేక ఆహ్వానితుల పదవీకాలమూ ముగుస్తుందని పేర్కొంది.

ఇదీ చూడండి: TTD Incense Sticks: తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు.. ఆ పూలతోనే తయారీ.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.