ETV Bharat / state

తగ్గిన ఆదాయం.. ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణలో తితిదే..! - Corona Effect on TTD Income news

కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గిపోగా... ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పేరుతో తితిదే తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. హుండీ, ఇతర ఆదాయాలు భారీగా తగ్గిపోవడం... బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల తితిదే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఆదాయం పెంచుకునే క్రమంలో అధిక వడ్డీ లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్గాలను తితిదే అన్వేషిస్తోంది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మొత్తాల్లో కొన్ని ఈ ఏడాది డిసెంబర్‌కు గడువు ముగియనుండగా... వాటిని ప్రత్యామ్నాయ ఆదాయాలకు వినియోగించాలని తితిదే నిర్ణయం తీసుకొంది. ప్రధానంగా తితిదే నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్స్‌ కొనుగోలు చేయాలన్న నిర్ణయం చర్చనీయాంశమైంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి నిధులను మదుపు చేయడంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో డిపాజిట్‌ చేసే అంశంపై తొందరపాటు నిర్ణయాలు తగవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తగ్గిన ఆదాయం.. ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణలో తితిదే..!

author img

By

Published : Sep 22, 2020, 11:45 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి హుండీతో పాటు వివిధ రూపాల్లో తితిదేకు సగటున నెలకు వంద కోట్ల రూపాయల పైబడి ఆదాయం సమకూరేది. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండగా శ్రీవారి ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనాకు ముందు రోజు దాదాపు రెండు కోట్ల రూపాయల మేర హుండీ ఆదాయం సమకూరింది. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో మూడు నెలల పాటు పూర్తిగా దర్శనాలు నిలిపివేశారు. అన్‌లాక్‌ ప్రారంభం నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తుండటంతో హుండీ ఆదాయం 50 లక్షల రూపాయలకు తగ్గిపోయింది.

భక్తుల హుండీ సమర్పణ, వసతిగృహాల అద్దెలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల వేలం వంటి వాటితో పాటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన స్వామివారి బంగారం, నగదుకు వడ్డీ రూపంలో ఆదాయం సమకూరేది. కరోనాతో నేరుగా వచ్చే ఆదాయాల్లో భారీగా కోతపడింది. మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్లకు వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఏడాదికి రెండున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ ఉన్న తితిదేపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ నేపథ్యంలో ఆలయాల నిర్వహణతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతుందని భావిస్తున్న తితిదే.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌ నెలకు గడువు తీరనున్న దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్ల మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొంది. బ్యాంకుల్లో వడ్డీ తగ్గిపోవడం వల్ల ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గిపోవడం వల్ల ప్రత్యామ్నాయం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లను కొనాలన్న తితిదే నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ తగ్గించటంతో జాతీయ బ్యాంకుల్లో ఉన్న శ్రీవారి నిధులను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు కొనాలన్న నిర్ణయాన్ని వివిధ పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. తితిదే ధార్మిక సంస్థ అనే విషయాన్ని మరిచి.. ఆదాయ వనరుగా చూడటం సరికాదంటున్నారు.

దివాళా అంచున ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా వడ్డీ సంగతి ఎలా ఉన్నా.. అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని భాజపా, తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. తితిదే నిధులతో సెక్యూరిటీ బాండ్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయంపై ఆర్థిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని... పూర్తిస్థాయిలో సంప్రదింపుల తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు 11 గొడుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.