ETV Bharat / state

Hanuman Jayanthi: అంజనాద్రిలో హనుమాన్ జయంత్యుత్సవాలు - హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాప ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతి

అంజనాద్రిలోనే ఐదు రోజుల పాటు హనుమాన్ జయంత్యుత్సవాలు ( Hanuman Jayanthi ) నిర్వహిస్తున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ మేరకు ఆకాశ గంగ తీర్థంలోని హనుమాన్ జన్మస్థానంలోనే ( Anjaneya Birthplace ) ఉత్సవాలు జరుపుతామని స్పష్టం చేసింది.

ttd-hanuman-jayanthi-vedukalu-at-aakasa-ganga-in-tirupathi
Hanuman Jayanthi: అంజనాద్రిలో హనుమాన్ జయంత్యుత్సవాలు
author img

By

Published : Jun 4, 2021, 6:32 PM IST

తితిదే ఏర్పాటు చేసిన పండిత కమిటీ వెంకటాచల పర్వతాల్లోని అంజనాద్రి ( Anjanadri ) హనుమంతుడి జన్మస్థానంగా నిర్ధారించడంతో ఈ ఏడాది హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈఓ జవహర్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఆకాశ గంగ తీర్థంలో ఉన్న బాలహనుమ, అంజనా దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.

ఆకాశగంగ తీర్థంలో వాయుపుత్రుడి జననం..

హనుమంతుడు జన్మించిన ఆకాశగంగ తీర్థంతో పాటు జాపాలి క్షేత్రంలో కూడా ప్రత్యేక పూజలు ( Special Prayers ) నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా బేడీ ఆంజనేయస్వామికి నిర్వహించే పూజలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తిరుమల ఆలయం ముందు ఉన్న నీరాజనం వేదికగా హనుమంతుడి విశిష్టతను తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

Hanuman Jayanthi: అంజనాద్రిలో హనుమాన్ జయంత్యుత్సవాలు

ఆయన మాటలను పట్టించుకోం : జవహర్ రెడ్డి

ఐదు రోజుల పాటు తితిదే ఆధ్వర్యంలో హనుమాన్ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, పంపా కిష్కింద క్షేత్రం
వ్యవస్థాపక ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతికి ( Govindananda Saraswati ) హనుమ జన్మస్థానంపై అవగాహన లేదని.. ఆయన ప్రకటనలను తితిదే పరిగణలోకి తీసుకోదని ఈఓ స్పష్టం చేశారు.

అది పీఠమే కాదు..

మరోవైపు హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాప ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిపై ( Swaroopanandendra Swami ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన విశాఖ శారదాపీఠం పీఠమే కాదు.. నకిలీ పీఠమని ధ్వజమెత్తారు. పీఠాధిపతులు రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస నిబంధన కూడా స్వరూపానంద స్వామి పాటించడం లేదని ఎద్దేవా చేశారు. స్వరూపానంద స్వామికి అంతటి శక్తులు ఉంటే ఏపీ సీఎం జగన్​ను ప్రధాన మంత్రి చేయగలరా అని గోవిందానంద సరస్వతి నిలదీశారు.

ఇవీ చూడండి : Honda Price Hike: హోండా షైన్‌ ధర పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.