ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేచోటు శౌచాలయాలు అనేవి లేవు. దాని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొమన్నామని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి డిపోలో 60 నుంచి 70 మహిళలు ఉంటారని తెలిపారు. వాష్రూమ్స్ కోసం ఎవరో ఇంట్లోకి వెళ్లి వారిని బతిమిలాడుకునే పరిస్థితులుండేవని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ అడుగితేనే పెడుతుంది... కానీ నాన్నని అడగకుండానే మా సమస్యలు ఇవాళ తీర్చారని కేసీఆర్ను ఉద్దేశించి భావోద్వేగమయ్యింది ఓ మహిళ ఉద్యోగి. దేవుడిలా మహిళా కండక్టర్ల సమస్యలు తీర్చాడని కొనియాడారు.
మహిళలకు ఇదో పెద్ద వరం... కేసీఆర్ సార్కు చాలా ధన్యవాదాలు.... వాటర్ తాగకుండా విధులు మేం నిర్వర్తించేవాళ్లం... దానితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేవి... మాకు అడగకుండా అన్నం పెట్టిన కేసీఆర్ సార్కు దండాలు.... ఓ మహిళా ఉద్యోగి ఆవేదన
చాలా మందికి యూరిన్లో స్టోన్స్ వచ్చేవి... డిపో నుంచి పోయి... డిపోకు వచ్చే వరకు నీళ్లు తాగకుండా ఉండేవాళ్లం... మరో మహిళా ఉద్యోగి ఆవేదన
ఇవీ చూడండి.. 'కనేరియా హిందువని వివక్ష చూపారు'